పాలకొల్లు, యలమంచిలి, డిసెంబర్,30(తెలుగు న్యూస్ పవర్) ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణ ఆలయాలు మంగళవారం ఉదయం నుంచి భక్తుల సందర్శనలతో కిక్కిరిసిపోయాయి. పాలకొల్లు శివాలయం జగన్ అన్నది జగన్నాధుని ఉపాలయాన్ని, స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి భక్తులు విశేషంగా తరలించారు. స్థానిక ఎడ్ల బజార్లో వేంచేసి ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో నామము నా బొంతును రామ బంటును దర్శించుకున్నారు. ఈ సందర్భంగా,ఇక్కడ ప్రసాద వితరణ, విశాఖపట్నంకు చెందిన తాళ్లూరి శ్రీనివాస్, (వైజాగ్ బుజ్జి) ఏర్పాటు చేశారు. యలమంచిలి ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద తాళ్లూరి శ్రీనివాస్, శిరీష దంపతులు ఏకాః పూజలు నిర్వహించారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. అడవిపాలెం ఆంజనేయ స్వామి గుడి వద్ద మహా ప్రసాదానికి భక్తులు పోటెత్తడంతో నిర్వాహకులు ఇబ్బంది పడ్డారు. పాలకొల్లు సుబ్బారాయుడు గుడి వద్ద పడాల రాజు కుటుంబ సభ్యులు మహా ప్రసాద వితరణ చేశారు. ఇక్కడ కూడా భక్తులు విశేషంగా రావడంతో భోజన ఏర్పాట్లు అంచనాలకు మించాయి. ఈసారి ముక్కోటి ఆంజనేయ స్వామి ఇష్టమైన రోజు రావడం వల్ల ఆయా దేవాలయాలకు భక్తులు భారీగా తరలి వచ్చారు.
