Telugu News Power

వ్యవసాయ అధికారుల క్షేత్ర పర్యటన.

వరి పంటను పరిశీలిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం

పాలకొల్లు: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్)
స్థానిక మండలం వెలివెల, ఆరట్లకట్ట గ్రామాల్లో ఆత్మ వారి సహకారం తో మంగళవారం రైతులకు సమావేశం ఏర్పాటు చేశారు. అగర్తి పాలెం లో వరి పాలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమం లో మారుటేరు శాస్త్ర వేత్తలు డాక్టర్ మల్లి కార్జునరావు మాట్లాడుతు వరి పంట పాలు పోసుకొనే దశ లో ఉన్నది ఉక్కబోత గా ఉంటుంది, కావున దోమ వచ్చే సూచన ఉంది, కాబట్టి రైతులు జాగ్రత్తగా పొలం ని పరిశీలించి కోవాలన్నారు.ఒకవేళ మందు కొట్టవలసి వస్తే ఆసిఫేట్ 2గ్రాములు ఒక లీటర్ నీటికి కల్పి పిచికారీ చేసుకోవాలని సూచించారు. డాక్టర్ రమణారావు వచ్చే సార్వ మరియు దాల్వా వరి రకాలు గురించి వివరించారు. శాస్త్ర వేత్త శ్రీనివాస రావు వరి లో వేయవలసిన ఎరువులు గురించి వివరించారు ఏ డి ఏ మురళి కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం పథకాలు, రైతుల యాప్ ల గురించి వివరించారు. పకృతి వ్యవసాయం విభాగం ద్వారా ఈ నెలకారు నుంచి నవధాన్యాల కిట్స్ రైతులకు ఇస్తారన్నారు. ఈ కార్యక్రమం లో సొసైటీ ప్రెసిడెంట్ బోడపాటి వెంకటనారాయణ, సర్పంచ్ కందుల వెంకటేశ్వరావు ఎంపీటీసీ దొమ్మటి ఏసుదాస్, కoడిబోయన నాగరాజు, నాగేశ్వరావు, కొప్పినీడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు