Telugu News Power

శ్రీవారి కళ్ళు ఎందుకు ఎరుపు

శ్రీ రంగనాథుని రూపంలో దర్శనమిస్తున్న స్వామి

పాలకొల్లు: డిసెంబర్,3 (తెలుగు న్యూస్ పవర్) శ్రీవారి కళ్ళు ఎందుకు ఎరుపు రంగులో ఉన్నాయని, శ్రీదేవి కనులు ఎందుకు నల్లగా ఉన్నాయ తెలుసుకుంటే, లక్ష్మీదేవి మేని చాయ ఎర్రని ఎరుపు రంగులో ఉండటం వల్ల, శ్రీవారు, శ్రీదేవిని తదేకంగా చూస్తూ ఉండటం వల్ల, ఆ ఎరుపు శ్రీవారి కళ్ళల్లో ప్రతిబింబిస్తుందని, శ్రీదేవి, స్వామి వారు
నీల మేఘశ్యాముడు కావడం వల్ల, ఎల్లప్పుడు ఆ స్వామివారి వీక్షించడం అమ్మవారి పద్మ పత్ర దళ నేత్రాలు నలుపుగా మారాయని, శ్రీదేవి,శ్రీవారి మధ్య అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా తెలిపారు. స్థానిక అష్టభుజ లక్ష్మీ నారాయణ స్వామివారి ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా తిరుప్పావై పూజల సందర్భంగా పాశురాలు వివరిస్తూ, ఇలాంటి నిగూడ భక్తి పరవశ్య పలువిషయాలు భక్తులకు వివరించారు పండితులు పవన్. స్వామివారు. శ్రీదేవి 19 రోజు శనివారం, దవళపాన్పు పై శ్రీరంగనాధుడు, శ్రీరంగ నాయకి గా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ పాశురంలో అందమైన దీప కాంతులతో, నేను ఏనుగు దంతాల మంచం పై మెత్తని పరుపుపై పవళించిన దీవిని నిద్ర లేపటానికి గోదాదేవి చేసే ప్రార్ధన ఇది ఆమెను ఆమె అందాన్ని, భగవంతునితో ఆమె సంబంధాన్ని వర్ణించి, త్వరగా తలుపు తీయమని వేడుకునే పాశురం ఇది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా, 19 వ పాశురం లో, పురుషకాల వైభవాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా పూజాధికాలు, హారతులు నయనానందకరంగా, భక్తి పారవశ్య ప్రదంగా జరిగాయి. స్వామివారి దంపతులకు పళ్ళు,పలహారాలు, పూమాలతో, పూలజడతో అలంకరించారు. ఈ సందర్భంగా పాశురాలు పాడుతూ స్వామివారిని,శ్రీదేవిని మేలుకొల్పారు మేలుకొల్పారు. భక్తి గీతాలు మధురంగా, సామూహిక ఆలాపన చేశారు. నర్సాపురం,అమెరికా నుంచి వచ్చిన భక్తులు స్వామి వారి వేడుకల్లో పాల్గొని తరించారు. స్వామివారి ప్రసాదకైంకర్యానికి , సౌజన్యం అందించిన భక్తులను సత్కరించారు. మాజీ ఎమ్మెల్యే బంగారు ఉషారాణి, ఛాంబర్స్ కాలేజీ కోశాధికారి,ప్రవీణ్ భాను, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బంగారు పుల్లయ్య, పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ధనుర్మాస పూజ కు హాజరైన భక్తులు