Telugu News Power

శ్రీ ఉమా సోమేశ్వర కళ్యాణోత్సవాలు సంపూర్ణం

ఉమా సోమేశ్వర స్వామి వారి దేవస్థానము వద్ద సాంస్కృతిక ప్రదర్శన

యలమంచిలి: ఏప్రిల్, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఉమా సోమేశ్వర స్వామి వారి కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి, సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. పాలకొల్లు, నృత్య కళాంజలి బాలలు సాంప్రదాయ, జానపద నృత్యాలతో భక్తులను అలరించారు. శ్రీ విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వారు ఈ కార్యక్రమానికి సౌజన్య అందించారు. రాత్రి అఖండ అన్న సమారాధన జరిగింది. ఆలయ చైర్మన్ అడబాల శ్రీమన్నారాయణ, ధర్మకర్తలు, అర్చకులు యలమంచి నరేంద్ర శర్మ, భక్తులు విశేషంగా పాల్గొన్నారు.