
పాలకొల్లు: మార్చి,18(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణం ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆలయ కమిటీ, అర్చకుల సమావేశంలో అధికారులు నిర్ణయించారు. స్థానిక అభిషేక మండపంలో బుధవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం, ఉగాది పురస్కారాలు, నిత్య అన్నదాన పథకం, నిర్వహించాలని, ఆలయ అభివృద్ధి కోసం ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 28 జరిగే స్వామివారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు., ఇందుకు సంబంధించి, గోడ పత్రిక ఆవిష్కరణ చేస్తారని తెలిపారు. ప్రధాన అర్చకులు, అభిషేక పండితులతో గల ,50 మంది బృందంతో అభిప్రాయ సేకరణ చేసి వారి సూచన మేరకు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు తెలిపారు. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు, మీసాల రామచంద్ర రావు ఉగాది సందర్భంగా, కొత్త పంచాంగాలు పంచిపెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో, ఆలయ ప్రధాన అర్చకులు క్రిష్టప్ప, అనిల్, వీరబాబు, గాయత్రి స్మా ర్త పురోహిత సంఘం అధ్యక్షులు, ముదురుపాటి శ్రీనివాస్, కార్యదర్శి, కాశి, ఉపాధ్యక్షులు టి శ్రీనివాస్, పర్యవేక్షకులు పి వాసు పాల్గొన్నారు.