Telugu News Power

శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కమిటీ.

కమిటీ సభ్యులకు ఆశీర్వచనం చేస్తున్న దృశ్యం

పాలకొల్లు: మార్చి, 24,(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారిని పలువు కమిటీ సభ్యులు దర్శించుకున్నారు.దేవస్థానము వారు, మంగళవారం, మర్యాదలతో స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ కమిటీ చైర్మన్ ఇసాక్ బాష ,ఎమ్మెల్సీ నంద్యాల వారు, కౌరు శ్రీనివాస్, ఎమ్మెల్సీ ,కౌన్సిల్ కమిటీ మెంబర్ కొనితివాడ వారు, ఎన్.వి.రామచంద్ర రెడ్డి ఎమ్మెల్సీ కౌన్సిల్ సభ్యులు కడప వారు శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు వీరిని ప్రధాన అర్చకులు అనిల్, కిష్టప్ప ఆశీర్వచనం చేసి శాలువాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేసారు ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ కమిషనర్ వెండ్ర త్రినాథ్ పశ్చిమగోదావరి జిల్లా డిఈఓ హరి సూరి ప్రకాష్ , ఆలయ కార్యనిర్వాహణ అధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, ధర్మకర్తలు పాల్గొన్నారు.