భీమవరం: ఏప్రిల్, 5 (తెలుగు న్యూస్ పవర్.కాం) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి భీమవరం కి చెందిన ఆలయ మాజీ ధర్మకర్త వడ్డీ సుబ్బారావు కుమారులు, వడ్డీ దివ్య, వీర వెంకట శ్రీకాంత్ దంపతులు 10 గ్రాముల బంగారం మరియు మోటూరు కి చెందిన కారిచర్ల ఉషశ్రీ 7 గ్రాముల బంగారం సమర్పించారు,వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆశీర్వచన పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం మరియు ఆలయ ధర్మకర్తలు రామాయణo శ్రీనివాస్, పాపోలు ఏడుకొండలు అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందచేసినారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలియచేసినారు
శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి 17 గ్రాములు బంగారం కానుకగా సమర్పించిన భక్తులు.
అమ్మవారికి బంగారు కానుక సమర్పిస్తున్న భక్తులు