భీమవరం: ఫిబ్రవరి,13(తెలుగు న్యూస్ పవర్) జిల్లాలో సాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా కాలువల అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.
వశిష్ట సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో సాగునీటి డ్రైన్లు, షట్టర్లు, కాలవగట్లు, తూడు తొలగింపు పనులను వేగవంతం చేయాలని సూచించారు. మంజూరు కాని పనులకు వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని, టెండర్లు ప్రక్రియ ముందుగానే పూర్తి చేయాలన్నారు. కాలవలు నిలిపివేసిన వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు.
పశ్చిమ డెల్టా పరిధిలో 2,221 కిలోమీటర్ల కాలువలు విస్తరించి ఉండగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఓ & ఎం పనులకు రూ.1273.65 లక్షలు మంజూరు అయ్యాయి. తూడు తొలగింపు, పూడిక తీత, షట్టర్ మరమ్మత్తులు తదితర పనులను నాణ్యతతో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
మొగల్తూరు మండలంలో తూడు తొలగింపు పనులను త్వరగా పూర్తి చేయాలని, దర్భ రేవు పూడికతీత పనులకు వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు.
సాగునీటి సరఫరా సక్రమంగా సాగాలి. -కలెక్టర్ నాగరాణి ఆదేశాలు