పాలకొల్లు: జనవరి, 4(తెలుగు న్యూస్ పవర్) భారత స్త్రీకి విద్య ద్వారా బంధనాలనుంచి ముక్తి కలిగించాలని పూనుకున్న జ్యోతిబాయ్ పూలే, జయంతి సందర్భంగా,ఆదివారం, స్థానిక వైష్ణవి టెక్నో హైస్కూల్లో, ఎలమంచిలి మండల శాఖ ఈ సమావేశం నిర్వహించారు. సావిత్రిబాయి, చేసిన పోరాటాలను, ఎదుర్కొన్న కష్టాలను, స్ఫూర్తిదాయకమైన ఆమె జీవిత విశేషాలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి బి శైలజ అధ్యక్షత వహించారు. డి పద్మావతి, ఎస్ డి పాలేశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. యుటిఎఫ్, యలమంచిలి మండల శాఖ బాధ్యులు జి శ్రీనివాస్, అంతం రామ్మూర్తి నాయుడు, జగ్గారావు, సందీప్ కుమార్, బి.రమాదేవి తదితరులు పాల్గొన్నారు.