Telugu News Power

సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు.

సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సిద్ధారెడ్డి

న్యూఢిల్లీ: మార్చి, 16(తెలుగు న్యూస్ పవర్.కామ్)తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, రచయిత డాక్టర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ 2025 పురస్కారం ప్రకటించింది.
ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటిన కవి నందిని సిధారెడ్డి. ఆయన రాసిన “అనిమేష” కవితా సంపుటికి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. సిధారెడ్డి
కరోనా మహమ్మారి కాలంలో ప్రపంచం ఎదుర్కొన్న సంక్షోభాలను, మానవ సంబంధాల విచ్ఛిన్నతలను చిత్రీకరించడంవల్ల తనకు సమాజంపట్ల ఉన్న నిబద్ధతను, అలాగే తనలోనున్న ఆర్ద్రత మనకు అవగతం అవుతుంది. వారు గొప్ప మానవతావాది. సిధారెడ్డి సుదీర్ఘ సాహిత్య కృషికి లభించిన గౌరవం ఇది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అక్షరాన్ని ఆయుధంగా మలిచి ప్రజల్లో చైతన్యం నింపడంలో వారు పోషించిన పాత్ర చిరస్మరణీయయం.
ఆధునిక తెలుగు కవిత్వంలో నందిని సిధారెడ్డి ఎన్నో పరిశోధనాత్మక రచనలతో సాహితీ రంగానికి విశిష్ట సేవలు అందించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కడం వారి సాహిత్య ప్రస్థానానికి దక్కిన గౌరవం. సాహితీ రంగంలో సిధారెడ్డి మరెన్నో శిఖరాలను అధిరోహించాలని, పలువురు ఆకాంక్షించారు.