యలమంచిలి: మార్చి, 11 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రజా సమస్యల పరిష్కారానికై సిపిఎం పార్టీ నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్ర బుధవారం సాయంత్రం యలమంచిలి సెంటర్ కు చేరింది. ఈ యాత్రలో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ఈ యాత్ర 20 మండలాలు, ఆరు పట్టణాల్లో 650 కిలోమీటర్ల లో జరుగుతుంది. గత నెల 26న మొదలైన యాత్ర, ఈనెల 23న ముగుస్తుంది. ఇళ్ల స్థలాలు, టిడ్కో ఇళ్ళ సమస్యల పరిష్కారం, రక్షిత మంచినీరు, విద్య, కరెంట్ చార్చీల పెంపు, స్మార్ట్ మీటర్లు దోపిడి, తదితర సమస్యలపై యాత్రలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సిఐటియు నాయకులు దేవ సుధాకర్, సిపిఎం నాయకులు జార్జ్, పలువురు మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సిపిఎం పార్టీ ప్రజా చైతన్య యాత్ర.
ప్రజా చైతన్య యాత్రలో ప్రసంగిస్తున్న సిపిఎం నాయకులు