న్యూఢిల్లీ: మార్చి, 12(తెలుగు న్యూస్ పవర్. కాం) పరిశ్రమలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను పర్యావరణ పరిరక్షణ కోసం కేటాయించాలని, రాజ్యసభ సభ్యులు, బిజెపి నాయకులు బాగా సత్యనారాయణ కోరారు. రాజ్యసభలో, గురువారం ఈ మేరకు సూచన చేశారు. కంపెనీల చట్టం, 2013 ప్రకారం తమ లాభాల్లో 2శాతం వాటా సిఎస్ఆర్ నిధులకు కేటాయించవలసి ఉందన్నారు. ఈ మొత్తం,2023-2024 లో రూ.34, 908 లు ఉందన్నారు. ఈ నిధులు పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణకు వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. పరిశ్రమల వల్ల ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేయవలసిన బాధ్యత పరిశ్రమలపై ఉందన్నారు. అభివృద్ధి, పర్యావరణ సంరక్షణ ఏకతాటిపై నడవాలని సూచించారు.
సి ఎస్ ఆర్ నిధులు పర్యావరణ పరిరక్షణకు కేటాయించాలి. -ఎంపీ పాక సత్యనారాయణ
రాజ్యసభలో మాట్లాడుతున్న ఎంపీ పాక సత్యనారాయణ