Telugu News Power

‘సేవా తీర్థ్‌’ లో కొలువు తీరిన ప్రధాని మోడీ.

న్యూఢిల్లీ: ఫిబ్రవరి,13(తెలుగు న్యూస్ పవర్) భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం సేవా తీర్థ్‌ ప్రారంభించారు. ఇకనుండి ప్రధానమంత్రి కార్యాలయం, కార్యకలాపాలన్నీ నూతనంగా నిర్మించిన ఈ సేవ తీర్థ నుండి ప్రధాన మోడీ నిర్వహించనున్నారు.
కొత్త పీఎంఓ కార్యాలయం ‘సేవా తీర్థ్‌ ను ప్రారంభించిన వెంటనే, ప్రధాని మోదీ ప్రజా సంక్షేమం కోసం 4 కీలక నిర్ణయాలపై సంతకాలు చేశారు.
పిఎం రాహత్ పథకం ద్వారా లక్షన్నర వరకు ప్రమాద బాధితుల వైద్య చికిత్స కు అందజేస్తారు. లక్ పతి దిదీ పథకం ద్వారా ఆరు కోట్ల మందికి, మహిళా సాధికారిక లక్ష్యం సాధించాలని నిర్దేశించారు. అన్నదాతల కోసం, ఆగ్రి ఇన్ఫ్రా ఫండ్ 2 లక్షల కోట్లుకు పెంచారు.
స్టార్టప్ ఇండియా కోసం 10 వేల కోట్ల నిధి ఏర్పాటుకు సంతకం చేశారు.
ఇవి దేశానికి ఎంతో మేలు చేసే పథకాలుగా బిజెపి ప్రభుత్వం ప్రకటించింది.