Telugu News Power

సొంతగూటికి శేషుబాబు, ఇదివరకే నాగబాబు.

మాజీ ముఖ్యమంత్రిని వివాహానికి ఆహ్వానిస్తున్న శేషుబాబు, కుటుంబ సభ్యులు

పాలకొల్లు: ఫిబ్రవరి,24(తెలుగు న్యూస్ పవర్) ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానిక నియోజకవర్గ రాజకీయ దిగ్గజం మేక శేషుబాబు తన పెద్ద కుమారుడు సందీప్ వివాహానికి, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కుటుంబ సమేతంగా వెళ్లి ఆహ్వానించారు. గత కొంత కాలంగా శేషుబాబు వైయస్సార్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు, అత్యంత విశ్వాస పాత్రునిగా ముద్ర వేసుకున్నారు. అందుకు తగినట్టుగానే వారికి పదవులు కేటాయించారు. పార్టీ మారతారని కూడా విస్తృత ప్రచారం జరిగింది. టిడిపి వైపు చూస్తున్నారని ఊహాగానాలు సాగాయి. అయితే వీటన్నిటికీ, శేషు బాబు ఇంట, మార్చి 9న జరిగే వివాహ వేడుక సందర్భంగా, ఈ రాజకీయ అనిశ్చితి తెరలు తొలగిపోవచ్చునని, పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
వైసిపి మరో ముఖ్య నేత, గుణ్ణం నాగబాబు, వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. అప్పటికప్పుడు జనసేన పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్నాను. గెలుపు దగ్గర వరకు మరోసారి వెళ్లి వచ్చారు. అయితే ఆ పార్టీలో ఆయన ఎక్కువ కాలం ఇమడలేక పోయారు. ఇద్దరూ రాజకీయ ఉద్దండులు. వీరి గర్ వాపసి, జిల్లా వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ పార్టీ, స్థానిక నియోజకవర్గ ఇన్చార్జి గుడాల హరి గోపాల్ రావు మారుస్తారని, తరచూ ప్రచారం జరుగుతుంది. ఈ నేపద్యంలో ముగ్గురు నేతల మధ్య సయోధ్య ఎలా ఉంటుందో అని ఆసక్తిగా రాజకీయ వర్గాల వారు ఎదురుచూస్తున్నారు. ఒక వరలో రెండు కత్తులు ఇమడవు. వచ్చే ఎన్నికల నాటికి వైయస్సార్ పార్టీకి ఎవరు అభ్యర్థి అవుతారనేది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్న.