Skip to main content

Telugu News Power

చెన్నై ఆలయం, హిందూ ముస్లింలకు ఆత్మీయ వరం

ఇఫ్తార్ విందు స్వీకరిస్తున్న ముస్లిం సోదరులు

చెన్నై: ఫిబ్రవరి, 24 (తెలుగు న్యూస్ పవర్)
ప్రేమ ఐక్యతలకు గుర్తుగా గత కొన్ని దశాబ్దాలుగా మద్రాస్ నడిబొడ్డున ఉన్న ఆలయంలో ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్నారు. ముస్లిం సోదరులకు, సోదరీమణులకు, గత 40 ఏళ్లుగా సుఫీదార ఆలయం రంజాన్ రోజున భోజన ఏర్పాట్లు చేస్తుంది. ఈ అద్భుతమైన ఆచారాన్ని, దాదా రతనచంద్ ప్రారంభించారు. మీరు పాకిస్తాన్లోని సింధు ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడ్డ హిందువులు. హిందూ ముస్లిం కార్యకర్తలు కలిసి 1200 మందికి వంట తయారు చేస్తారు. ఫ్రైడ్ రైస్, బిరియాని, కూరగాయలతో చేసిన పచ్చళ్ళు, కుంకుమపువ్వుతో చేసిన పాలు పళ్ళు ఉంటాయి. వాల్జా మసీదుకు సాయంత్రం ఐదున్నర గంటలకు అలా చేరుస్తారు.
ఈ చెన్నై దేవాలయం ప్రేమా దయతో ఈ ఆచారం సమాజంలో భిన్న ధృవాలను ఏకం చేసి సమాజాన్ని శాంతి సంతోషాలతో నింపడం ముదావహం.