పాలకొల్లు: నవంబర్,25 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక సుబ్బారాయుడు గుడి సెంటర్లో వేంచేసి ఉన్న, శ్రీవల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పంచాహానిక దివ్య కళ్యాణ మహోత్సవం మంగళవారం రాత్రి కనుల పండుగ జరిగింది. స్వామివారి వివాహ మహోత్సవం చెన్నుపాటి వెంకట శేష ప్రమోద్, చందు ప్రియ దంపతులుచే జరిపించారు. ఈ ఉత్సవాలు సోమవారం గణపతి పూజ, అంకురార్పణ మరియు ధ్వజరా ధ్వజారోహణం తో ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం పంచపాలిక పూజ, బలిహరణ జరిగింది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి షష్టి బుధవారం జరుగుతుంది. ఈ దేవాలయం సుమారు 250 ఏళ్ల సుధీర్ఘ చరిత్ర కలిగి ఉందని ఆలయ ప్రధాన అర్చకులు యలమంచిలి కుమార్ తెలిపారు. ఈ ఆలయానికి కంచర్లవారు ధర్మకర్తలని తెలిపారు. ఆ తదుపరి గుండం విశ్వేశ్వరరావు, వారి బృందం ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ప్రతి మంగళవారం అన్నదాన ప్రసాద వితరణ గత రెండు రెండేళ్లుగా జరుపుతున్నారన్నారు. సుమారు 2000 మంది ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారన్నారు. పాలకొల్లులో దాదాపు 6 సుబ్రహ్మణ్యం స్వామి దేవాలయాలు ఉన్నప్పటికీ, సుబ్బారాయుడు గుడి సెంటర్లో ఉన్న ఈ ఆలయమే ప్రధానమైనది అన్నారు. ఇక్కడ తెల్లవారుజామున అభిషేకాలు నిర్వహిస్తారు.షష్టి పండుగ రోజు పాలకొల్లు పరిసర గ్రామాల భక్తులు సుమారు 25 వేల వరకు రోజంతా దేవాలయాన్ని దర్శించుకుంటారన్నారు. ఐదు రోజులు పాటు ఉత్సవాలు జరుగుతాయి.వచ్చేనెల రెండు 2న అఖండ అన్న సమారాధన తో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. భక్తుల రద్దీని నియంత్రించడానికి దేవస్థానం కమిటీ కుర్రాళ్ళు తెల్లవారుజామించే స్వచ్ఛందంగా సేవలందిస్తారు. గుణ్ణం విశ్వేశ్వరరావు ,అధ్యక్షులు, గుమ్మల్ల కృష్ణ కార్యదర్శి, వారి బృందం సుమారు నెల రోజులుగా ఈ ఉత్సవాల నిర్వహణ కోసం రాత్రి పగలు కృషి చేస్తున్నారు.