పాలకొల్లు:డిసెంబర్,8(తెలుగు న్యూస్ పవర్) మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీని 11 సీట్లకే ప్రజలు పరిమితం చేసినప్పటికీ ఆయనలో ఏ మార్పు రాలేదని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. తిరుపతి హుండీ పరకామణి చోరీ కేసులో నిందితులను వెనకేసుకురావడాన్ని మంత్రి ఖండించారు. జగన్ దృష్టిలో 70 వేల చోరీ చిన్న మొత్తంగా కనపడిందంటే, అది నిజమే కావచ్చు అన్నారు. లక్షల కోట్లు తిన్న జగన్ ఎవరు ఏమీ చేయలేకపోయారని, దర్జాగా బయట తిరగ్ కలుగుతున్నానని అందువల్ల పరకామని చోరీ కేసు చిన్నదే అవుతుందని మంత్రి నిమ్మల ఎద్దేవా చేశారు. దొంగిలించిన సొమ్ము భక్తులదని అది నమ్మకంతో కూడుకున్నదని జగన్ గ్రహించాలన్నారు. హిందువైనా క్రిస్టియన్ అయినా ఎవరి నమ్మకాలను వారికి ఉంటాయని వాటిని గౌరవించాలని మంత్రి సూచించారు. కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గ అభివృద్ధిలో ముందుకు దూసుకు వెళ్తామని మంత్రి నిమ్మల ప్రకటించారు. ఈ పర్యటనలో తెలుగుదేశం నాయకులు కర్నేని గౌరి నాయుడు,రోజారమణి, పెచ్చెట్టి బాబు,గండేటి వెంకటేశ్వరరావు,దేవస్థానం చైర్మన్ లు మీసాల రామచంద్ర రావు,తులా రామలింగేశ్వరరావు, చిన్నమిల్లి గణపతి రావు, బీజేపీ నాయకులు కపర్ది, తదితరులు పాల్గొన్నారు. ఈ పర్యటన సందర్భంగా పలువురు స్థానికులు మంత్రి సేవలను, వారు పొందుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల లబ్ధిని వివరిస్తూ మంత్రి పట్ల తమ అభిమానం వ్యక్తం చేశారు.