Telugu News Power

4 లక్షల నజరానా టెన్నిస్ పోటీలు ప్రారంభం

సిహెచ్ బుద్దావతారం రాజు స్మారక టెన్నిస్ పోటీలకు శనివారం తెరలేచింది. పాలకొల్లు కాస్మోకల్చరర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో క్వాలిఫైయింగ్ మ్యాచులు ప్రారంభమయ్యాయి. ఆర్గనైజింగ్ సెక్రటరీ జిఎస్విఆర్ ఎస్ ఎన్ రాజు, బూన్ రాజు పత్రికలకు ఈ విషయం వెల్లడించారు. ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో 82 మంది క్రీడాకారులు పాల్గొంటారు. వీరు 45,55, 65, 70 ఏళ్ల వయసు కేటగిరీలో మ్యాచ్ లు ఆడతారు. ఈ పోటీలు సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో నిర్వహిస్తారు. ఈ మ్యాచ్లు గెలిచిన వారితో పాటు ,ఈనెల 10వ తేదీ నుంచి మెయిన్ డ్రాకు ఎంపికైన క్రీడాకారులు తోడవుతారు.వీరు వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 230మంది వరకు ఉంటారు. క్రీడాకారులందరికీ ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం, వసతి వరకు ఏలోటు లేకుండా అతిధి మర్యాదలు ఉంటాయని బూన్ రాజు తెలిపారు. క్వాలిఫైంగ్ మ్యాచ్లు పూర్తయిన తర్వాత ఈనెల 10వ తేదీ నుంచి మెయిన్ డ్రా పోటీలు మొదలవుతాయి.ఈ క్రీడల్లో దేశవ్యాప్తంగా ఉన్న టెన్నిస్ ఆటగాళ్లు పాల్గొంటారు. ముంబై, కర్ణాటక ,కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న విజేతలకు ట్రోఫీ తోపాటు నాలుగు లక్షల రూపాయల భారీ ప్రైజ్ మనీ ఇస్తామని బూన్ రాజు తెలిపారు. ఈ పోటీలు కాస్మో కోర్టు ,పాలకొల్లు టౌన్ హాల్ కోర్టు, నరసాపురం ఆఫీసర్స్ క్లబ్ రెండు కోర్టులు కలిపి నాలుగు చోట్ల ఏకకాలంలో జరుగుతాయి. ఇప్పటికే ఈ క్రీడా ప్రాంగణంలో టెన్నిస్ సంబరం సందడి మొదలైంది.