Telugu News Power

9 కోట్ల బహుమతితో, విశ్వ గురు స్థానానికి ఇండియా ఉపాధ్యాయిని రౌబుల్ నాగి.

అవార్డు అందుకుంటున్న రౌబుల్ నాగి.
ఫుట్ పాత్ పాఠశాల

దుబాయ్: ఫిబ్రవరి, 6(తెలుగు pi న్యూస్ పవర్) దేశం గర్వించదగ్గ, భారతీయ విద్యావేత్త రౌబుల్ నాగి, విద్యారంగానికి సంబంధించి నోబెల్ బహుమతిగా భావించే, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ టీచర్ అవార్డు-2026 అందుకున్నారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ ఆల్ ముక్తుమ్, జమ్స్ ఎడ్యుకేషన్, లండన్ కు చెందిన వేర్కి సంయుక్తంగా అవార్డు అందజేస్తున్నాయి. అవార్డు కింద 9 కోట్ల నగదు అందజేశారు. దుబాయిలో , వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ లో అవార్డు గురువారం,అందుకున్నారు. ప్రపంచం నలుమూలల నుండి 139 దేశాలకు చెందిన 5వేల ఉపాధ్యాయులు పాల్గొన్న,ఈ పోటీలో నాగి విజేతగా నిలిచారు. ప్రపంచానికి పాఠాలు నేర్పి, విశ్వ గురువుగా కీర్తించబడుతున్న భార తదేశ చరిత్రను, మరోసారి సువర్ణాక్షరాలతో లిఖించి, నిరూపించింది రౌబుల్ నాగి. ఈమె పుట్టుక,ప్రపంచ సుందర, భూతల స్వర్గం జమ్మూ కాశ్మీర్లో, 1980లో. వీరి కార్య క్షేత్రంగా, భూతల నరకంగా భావించే ముంబాయి, ప్రపంచస్థాయి మురికివాడలను ఎంచుకున్నారు. కళ కళ కోసమా? సమాజ హితం కోసమా? అనే చర్చ ముగింపు లేని ఓ బ్రహ్మ పదార్థం. అయితే నాగి, సమాజ ప్రయోజనం కోసమే తన చిత్రకళను అంకితం చేశారు. గత 24 ఏళ్లుగా ఈ కృషి కొనసాగిస్తున్నారు. మిస్సాల్ (ఆదర్శ)/(మోడల్) ప్రాజెక్టుగా ఆమె ఈ మిషన్ కొనసాగిస్తున్నారు. కోట్ల విలువైన భవంతులు, ఏ సి రూములు,బస్సులు ఏమీలేని నేపద్యం నుంచి అవార్డు అందుకోవటం, ప్రపంచం నివ్వెర పోయింది. శక్తివంతమైన తన చిత్రకళతో, వెలిసిపోయి, మకిలి పట్టిన ఇళ్లకు రంగులు వేసి, ఆ పేదల జీవితాలలో వెలుగులు నింపింది. వారి బిడ్డలకు, నడక బాట,(ఫుట్ పాత్) పాఠశాల గా మార్చిఇంది. బాట పక్క గోడలే పాఠాలు చెప్పాయి. తన చిత్రకలతో గోడలపై వివిధ విషయాలు, సైన్స్, మ్యాథ్స్, ఏదైనా రంగుల్లో చిత్రించి, చూసేవారిని కట్టిపడేసాయి. పిల్లలు కదలకుండా, ఆ చిత్రాల మహిమతో విద్య నేర్చుకుంటున్నారు. దేశవ్యాప్తంగా 800 పాఠశాలలు ఇలా ఆమె ఏర్పాటు చేసి పది లక్షల మంది,నిరుపేద బాలలకు విద్యాబుద్దులు నేర్పిస్తున్నారు. దేశ విదేశాల్లో 150కు పైగా చిత్రాలతో,8వందలప్రదర్శన లు ఇచ్చారు. మురికివాడలోని 285 గృహాలకు ఎనిమిది ఏళ్ళ క్రితమే రంగులు వేయించారు. కాశ్మీర్, కుప్వారా మదర్సాలో కంప్యూటర్ శ్రీకారం చుట్టారు. విద్య, విద్యార్థులను, శ్రద్ధ, బాధ్యత, ఉత్పాదకత గల పౌరులుగా తీర్చిదిద్దుతుందని నాగి నమ్ముతారు. తాను గెలుచుకున్న 9 కోట్ల రూపాయలు నిధులను వృత్తివిద్య పాఠశాల నెలకొల్పడానికి వినియోగించనున్నారు. పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. దుస్తులు, దుప్పట్లు పంపిణీ వంటి కార్యక్రమాలు వాటిలో ప్రధానమైనవి. నాగి ఘనవిజయం పట్లభారతీయుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ఈమె జీవితం, భవిష్యత్తులో మరి ఎందరికో, ఆదర్శంగా నిలుస్తుంది.

రంగుల్లోకి మారిన మురికివాడ
భారీ గోడ చిత్రం, మ్యూరాల్స్ గీసిన నాగి