Telugu News Power

9 కోట్ల మంది మహిళలకు నీటి మోత కష్టాలకు ఇక చెల్లు. జల్ జీవన్ మిషన్ 2.0 పొడిగింపు.

జల జీవన్ మిషన్ వచ్చును సమావేశంలో అధికారులతో పాటు పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
జల జీవన్ మిషన్ వర్చువల్ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కాం)
జల్ జీవన్ మిషన్ 2.0 లో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం అనంతరం ఢిల్లీ నుంచి వర్చువల్ గా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో మంగళవారం జరిగిన వర్చువల్ సమావేశం ద్వారా సంభాషించారు.
వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు జల్ జీవన్ మిషన్ 2.0కు అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ప్రధాని నరేంద్ర మోదీతో ఈ విషయంపై సంప్రదించారు.ఈ మిషన్ పొడిగింపు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు ఆమోదం లభించింది. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం మొదటి దశలో 16 కోట్ల మంది గృహాలకు కుళాయిలు ఇచ్చారు.
ప్రాజెక్టులో జరిగిన కొన్ని లోపాలను సవరించి నిర్వహణ కూడా చేపడుతున్నారు.
మరో 3 కోట్ల ఇళ్లకు సురక్షితమైన తాగు నీటిని అందించాల్సి ఉంది. ఇందుకోసం ఈ మిషన్ ను పొడిగించారు. ఏపీలో నీటి నాణ్యత ను పరీక్షించేందుకు డ్వాక్రా మహిళల సేవల్ని వినియోగించుకోవాలని సూచించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా వివిధ ప్రాంతాల్లో 9 కోట్ల మంది మహిళలకు దూరం నుంచి నీరు తెచ్చుకునే కష్టాలు తప్పుతాయి. జేజెఎం 2.0 ద్వారా ఏపీలో ప్రతీ ఇంటికి కుళాయి అనే లక్ష్యం నెరవేరుతుందని ఆశ బాబు వ్యక్తం చేశారు.
వికసిత్ భారత్ లక్ష్యం,2047 నెరవేరాలంటే ప్రతీ ఇంటికీ సురక్షిత తాగునీరు చేరటం ముఖ్యమని తెలిపారు. ప్రజలకు అవసరమైన సురక్షితమైన నీటిని అందించేలా ఈ జల్ జీవన్ మిషన్ 2.0 కార్యక్రమం చేపట్టామన్నరు. సాగు నీటి కోసం కూడా రైతులకు రెండు సార్లు నీరందితే వారు కూడా సంతోషంగా ఉంటారని తెలిపారు. జెజేఎం 2.0 పై త్వరలో ఏపీలో జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేస్తే ప్రాజెక్టు లక్ష్యాలను నిర్దేశించుకుందామని కేంద్ర మంత్రులకు సూచించారు. పీఎం జన్ మన్, పీఎం జన్ భాగీదారీ మిషన్ లో భాగంగానూ సురక్షిత నీటిని మారుమూల ప్రాంతాలకు అందించేందుకు నిధులు వినియోగించుకోవాలని కోరారు.
జల్ జీవన్ మిషన్ సాకారం అయ్యేందుకు కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని. ఏపీ పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి కోరారు. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్, జలజీవన్ శాఖామాత్యులు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ గా సమావేశంలో పాల్గొన్నారు.