పాలకొల్లులో టెన్నిస్సంరంభం ప్రారంభం
ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ ఈనెల 8 నుంచి 14 వరకు జరుగుతుందని పాలకొల్లు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు తెలిపారు. ఈ క్లబ్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు.
ఈ టోర్నమెంట్లో దాదాపు 200 మంది ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు పాల్గొంటారు. బహుమతి ప్రధానోత్సవం ఈనెల 14న జరుగుతుందన్నారు. ఈ సభకు మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు, పొత్తురి రామరాజు, కోడి విజయభాస్కర్ ముఖ్య అతిధులుగా హాజరవుతారన్నారు ఈ టోర్నమెంట్ విజయవంతం కావడానికి నరసాపురం ఆఫీసర్ క్లబ్, పాలకొల్లు టౌన్ హాల్ వారు వారి కోర్టులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. టెన్నిస్ టోర్నమెంట్ విజయవంతం చేయడానికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా శ్రీనివాసరాజు నియమితులయ్యారన్నారు.
సిహెచ్ బుద్ధావతారం వారి కుమారులు ఈ టోర్నమెంట్ కు ఐదు లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. కాస్మోపాలిటన్ స్పోర్ట్స్ క్లబ్ ఆతిథ్యం అంటే క్రీడాకారులు ఎంతో ఇష్టపడతారన్నారు. క్లబ్బు అతిధి మర్యాదలు ఆ స్థాయిలో ఉండటానికి కృషి చేస్తున్నట్టు క్లబ్ అధ్యక్షులు తెలిపారులు. క్రీడలకు, క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో పాతికేళ్ళు గా ఈ టోర్నమెంట్ కొనసాగిస్తున్నామన్నారు. ఇందుకు సహకరించాలని భగవాన్ రాజు అందరికీ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా శ్రీనివాసరాజును నియమించామన్నారు. ఈ పత్రికాసమావేశంలో పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.