Telugu News Power

ఉచిత వైద్య శిబిరంలో కళ్ళజోళ్ళు పంపిణి

పాలకొల్లు: మార్చి, 25(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మన్యం జగ్గమ్మ గారి సత్రం వద్ద మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించారు. స్థానిక రాజవల్లి రాధా రామన్ లయన్స్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఈ శిబిరం నిర్వహించారు. కంటి చూపు పరీక్షలకు 160 మంది హాజరు కాగా, 112 మందికి మన్యం జగ్గమ్మ సత్రం వారు ఉచితంగా కళ్ళజోళ్ళు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, మండాది అవినాష్, ఉన్నమట్ల కపర్తి,పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, అద్ధేపల్లి మోహన్ దాస్, ముచ్చర్ల శ్రీనివాసరావు, తమ్మినీడి సత్యనారాయణ రావు, తెలనాకుల కోటేశ్వరరావు, పొట్నూరి శ్రీనివాస్, గాదె చిన్న వెంకన్న, సత్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.