Telugu News Power

ఉపాధ్యాయ డిమాండ్లపై యుటిఎఫ్ పోస్ట్ కార్డ్ ఉద్యమం

పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభిస్తున్న పోలిశెట్టి

పాలకొల్లు: ఫిబ్రవరి, 9(తెలుగు న్యూస్ పవర్) ఉపాధ్యాయుల డిమాండ్ల పరిష్కారం కోరుతూ, యుటిఎఫ్ చేపట్టిన ఉద్యమంలో భాగంగా, సోమవారం పోస్ట్ కార్డులు, స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం, తపాలా పెట్టిలో ఉత్తరాలు వేసే కార్యక్రమాన్ని, జిల్లా ప్రధాన కార్యదర్శి,పోలిశెట్టి క్రాంతికుమార్ ప్రారంభించినారు. పి ఆర్ సి కమిషన్ వెంటనే నియమించాలని, డి ఏ బకాయలు చెల్లించాలని, మధ్యంతర బృతి, తక్షణమే ప్రకటించాలని, ఉత్తరాల్లో, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అధ్యక్షులు జి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి పి రామమూర్తి నాయుడు కోశాధికారి వి సందీప్ కుమార్ సహాధ్యక్షులుకే శరత్ బాబు, బి శైలజ ఆఫీస్ బేరర్స్ పి శ్రవణ్ కుమార్, వి వి ఎన్ బుద్దేశ్వర రావు, ఉపాధ్యాయులు పి కిషోర్, పరమహంస, కానుకొలను సత్యనారాయణ ఈ కార్యక్రమంలో
పాల్గొన్నారు.