Skip to main content

Telugu News Power

భవన నిర్మాణానికి గాంధీ భగవాన్ రాజు లక్షన్నర విరాళం.

గాంధీభవన్ రాజ్ నుంచి విరాళం అందుకుంటున్న పెయింటర్స్ అసోసియేషన్ నాయకులు

పాలకొల్లు: ఫిబ్రవరి,9(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఆర్టిస్టులు, పెయింటర్లు వెల్ఫేర్ అసోసియేషన్ భవనం నిర్మాణంలో కొనసాగుతున్నది. ఈ భవన నిర్మాణానికి, దాతల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. ఈ అసోసియేషన్ నాయకులు, సోమవారం, స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు, కాస్మో కల్చరల్ క్లబ్ అధ్యక్షులు, గాంధీ మెగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజును కలిసి, భవన నిర్మాణానికి సహకరించవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా, భగవాన్ రాజు తన సొంత నిధుల నుంచి 50 వేల రూపాయలు, కాస్మో కల్చరల్ క్లబ్ నుంచి మరో లక్ష రూపాయలు, విరాళం అందజేశారు. భగవాన్ రాజు, ద్వారా భూరి విరాళం అందుకున్న కమిటీ నాయకులు, వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ బృందదంలో, సంఘ నాయకులు,
అధ్యక్షులు,నీలం రవి
కార్యదర్శి,అధికారి పవన్ కుమార్,
కోశాధికారి,బొప్పే దుర్గా ప్రసాద్ షణ్ముఖరావు,
గౌరవ అధ్యక్షులు కోరుకొండ సుబ్బారావు
ఆర్గనైజింగ్ సెక్రటరీ చలపాటి నాగేంద్ర ప్రసాద్,
లీగల్ అడ్వైజర్,బొంతు వెంకట తిరుమల రావు,
ఉపాధ్యక్షులు,కెల్ల శేషు
సలహా సభ్యులు,వల్లూరి రామబ్రహ్మం,
సంఘ సీనియర్ సభ్యులు,పొన్నా సాయికృష్ణ,
కార్యవర్గ సభ్యులు పట్నాల బాల శ్రీనివాస్ సభ్యులు పాల్గొన్నారు.