93%తో అగ్రస్థానంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమరావతి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న మంత్రుల పనితీరుపై తాజాగా విడుదలైన ర్యాంకింగ్స్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ప్రజాభిప్రాయం, శాఖల పనితీరు, పాలనలో చురుకుదనం వంటి అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు సమాచారం.
ఈ ర్యాంకింగ్స్‌లో ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 93 శాతం పనితీరు స్కోర్‌తో తొలి స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత ఎన్. రామా నాయుడు (87%), సత్య కుమార్ యాదవ్ (86%) వరుసగా రెండో, మూడో స్థానాల్లో ఉన్నారు.
| ర్యాంక్ | మంత్రి పేరు | పనితీరు (%) |
|---|---|---|
| 1 | కె. పవన్ కళ్యాణ్ | 93 |
| 2 | ఎన్. రామా నాయుడు | 87 |
| 3 | సత్య కుమార్ యాదవ్ | 86 |
| 4 | నారా లోకేష్ | 84 |
| 5 | ఎన్. మనోహర్ | 84 |
| 6 | కె. దుర్గేష్ | 82 |
| 7 | పి. కేశవ్ | 77 |
| 8 | జి. సంధ్యారాణి | 74 |
| 9 | పి. నారాయణ | 72 |
| 10 | వి. అనిత | 71 |
| 11 | కె. రవీంద్ర | 69 |
| 12 | ఎ. రామ నారాయణ రెడ్డి | 68 |
| 13 | కె. అచ్చెన్నాయుడు | 65 |
| 14 | డీఎస్‌బీవీ అంజనేయ స్వామి | 63 |
| 15 | కె. పార్థసారథి | 61 |
| 16 | ఎస్. సవిత | 61 |
| 17 | వి. సుభాష్ | 59 |
| 18 | ఎ. సత్య ప్రసాద్ | 56 |
| 19 | కె. శ్రీనివాస్ | 55 |
| 20 | ఎం. రామ్ ప్రసాద్ రెడ్డి | 52 |
| 21 | ఎన్‌ఎండీ ఫారూక్ | 50 |
| 22 | బీసీ జనార్ధన్ రెడ్డి | 48 |
| 23 | టీజీ భరత్ | 48 |
| 24 | జి. రవి కుమార్ | 47 |
ఈ ర్యాంకింగ్స్ ద్వారా ప్రజల్లో ఉన్న నమ్మకం, శాఖల పనితీరు, ప్రజలతో మంత్రుల అనుసంధానం స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.