Telugu News Power

ఏ ఎస్ ఎన్ ఎం కాలేజీలో డ్రోన్ పైలెట్ శిక్షణ.

శిక్షణ కార్యక్రమం ప్రారంభిస్తున్న దృశ్యం

పాలకొల్లు: ఫిబ్రవరి,9(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాలలో విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాలు, వ్యాపార దృక్పథం మరియు స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా, ఎస్.కె.పి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), గుంతకల్లు, అనంతపురం జిల్లా వారి ఆర్థిక సహకారంతో, పీఎం–ఉషా జి.ఐ.ఈ. ఐ స్కీంలో భాగంగా ఏరీస్ ఆగ్రో లిమిటెడ్ ముంబై, కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్–I, II మరియు మహిళా సాధికారతా విభాగం వారి ఆధ్వర్యంలో బాలికలకు ప్రత్యేక శిక్షణ 5 రోజుల ఏరియల్ డ్రోన్ పైలట్ ట్రైనింగ్, రసాయన శాస్త్ర విభాగం మరియు మహిళా సాధికారతా విభాగం వారు 2 రోజుల భూసార పరీక్షల నైపుణ్యం కోర్సులు ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. రాజ రాజేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని, విద్యార్థులు నైపుణ్యాభివృద్ధి సాధించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని సూచించారు. పరిశ్రమలకు అనుగుణంగా రూపొందించిన ఈ స్కిల్ కోర్సులు విద్యార్థినిలకు ఆచరణాత్మక జ్ఞానం, ల్యాబొరేటరీ అనుభవం అందిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఏపీ ఎస్పీడీ డాక్టర్ నారాయణ భరత గుప్తా, మరియు గుంతకల్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మయ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి హాజరైన భూసార పరీక్షల నిపుణులు అశోక్ బాబు మాట్లాడుతూ, ప్రస్తుతం పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు విద్యార్థుల్లో పెంపొందించడమే ఈ కోర్సుల ప్రధాన లక్ష్యమని తెలిపారు. భూసార పరీక్షల కొరకు ల్యాబొరేటరీ ఆధారిత శిక్షణ, ప్రాక్టికల్ అవగాహన, టెస్టింగ్ మరియు అనాలసిస్ వంటి నైపుణ్యాలు విద్యార్థులకు భవిష్యత్‌లో మంచి ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని పేర్కొన్నారు.

డ్రోన్ టెక్నాలజీ రిసోర్స్ పర్సన్ వినయ్ మాట్లాడుతూ డ్రోన్ టెక్నాలజీ వ్యవసాయం, సర్వే, భద్రత, విపత్తుల నిర్వహణ, ఫోటోగ్రఫీ, డెలివరీ సేవలు వంటి అనేక రంగాల్లో విస్తృతంగా ఉపయోగపడుతోందని తెలిపారు. ఈ కోర్సు ద్వారా విద్యార్థులకు డ్రోన్ అసెంబ్లీ, ఫ్లైట్ ఆపరేషన్స్, సేఫ్టీ నిబంధనలు, డేటా కలెక్షన్ వంటి ప్రాక్టికల్ నైపుణ్యాలు అందిస్తామని వివరించారు.

కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ టి. కృష్ణ,తెలుగు విభాగాధిపతి డా. బి. వెంకట స్వామి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డా. ఎం. రామకృష్ణ, డా. వి. డి.వి. విజయలక్ష్మి, రసాయన శాస్త్ర అధ్యాపకులు ఏ.వంశీ సుబ్బరాయన్, దివ్య, అధ్యాపకులు డాక్టర్ సిహెచ్ ఉషారాణి, జీడి శ్రీనివాస్, పి శ్రీనివాస్,బి.కె.వి. రామలక్ష్మి , ఇతర అధ్యాపకులు మరియు విద్యార్ధిని విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు.