Telugu News Power

కళ్యాణోత్సవాలతో పులకించునున్న పాలకొల్లు.

పాలకొల్లు: డిసెంబర్,17 (తెలుగు న్యూస్ పవర్) ఉభయగోదావరి జిల్లాల గోవిందమాల కళ్యాణోత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరగనున్న 33వ కళ్యాణోత్సవాలతో పాలకొల్లు భక్తజనం పులకించనున్నారు. ఈనెల 20 నుంచి 22 వరకు పాలకొల్లు ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. ఈ పుణ్య కార్యానికి స్థానిక పెనుమదం రోడ్డులో గల ఆర్ఆర్ రైస్ మిల్ ప్రాంగణం వేదిక కానుంది. గణపతి హోమం శనివారం ఉదయం 7గంటలకు ప్రారంభమవుతుంది. దేవరపల్లి రామకృష్ణ దంపతులు పూజలు నిర్వహిస్తారు. శ్రీ చక్ర పూజ శనివారం ఉదయం 9గంటలకు ప్రారంభమవుతుంది. నంబూరి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో కాటంరెడ్డి సత్యనారాయణ దంపతులచే ఉచిత సామూహిక శ్రీ చక్ర పూజ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం, ఉత్సవ విగ్రహాలతో శ్రీవారి కల్యాణోత్సవం జరుగుతుంది. గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, పద్మావతి, కాటంరెడ్డి సత్యనారాయణ దంపతులచే కళ్యాణం జరిపిస్తారు. భక్తులకు కౌరు నాగరాజు అల్పాహారం అందించడానికి ఏర్పాట్లు చేశారు. అన్నవరం సత్యదేవుని ఉత్సవ విగ్రహాలతో ఆదివారం సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి సత్యదేవుని హోమం జరుగుతుంది. సత్యదేవుని వ్రతము 3వేల కలశాలతో జరుగుతుంది. పాలకొల్లు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఆధ్వర్యంలో అఖండ అన్న సమారాధన జరుగుతుంది. ఈ వ్రతానికి వచ్చే భక్తుల కొరకు ఉచిత బస్సు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు నవగ్రహ సుదర్శన అష్టదిక్పాలక హోమం నమ్మి రాజు దంపతులు నిర్వహిస్తారు. పాలకొల్లు పురవీధులలో 12 గంటల నుంచి స్వామివారి బ్రహ్మోత్సవ భారీ ఊరేగింపు జరుగుతుంది. గురు స్వామి యాదవ రెడ్డి సత్యం, అంగన్ రామ్మోన్,మేడికొండ శ్రీనివాస్, పెనుమాక రామ్మోహన్రావు, రెడ్డి వాసు, బీరక ప్రసాద్, కుంపట్ల నాగ శ్రీనివాస్, చెరుకూరు మురళి, కలిదిండి కృష్ణ వర్మ, కటారి నాగేంద్ర కుమార్, కాటంరెడ్డి సత్యనారాయణ, గాధం శెట్టి సతీష్ , డిటిడిసి బాబు, కౌరు నాగరాజు,బోనం మునసిబు, నమ్మిరాజు, ఇతర కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఇందుకు మహారాజ పోషకులైన సంధ్య మెరైన్, టౌన్ హాల్, పాలకొల్లు రైస్ మిల్లర్స్ అసోసియేషన్,పాలకొల్లు కోకోనట్ మర్చంట్స్ అసోసియేషన్ పలువురు ఇతర సభ్యులు తమ సౌజన్యాన్ని అందిస్తారు. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా 3.5 సెంట్ల భూమి, మేడపాడుకు చెందిన గంధం చల్లా రావు, ఆదిలక్ష్మి దంపతుల కుటుంబ సభ్యులు విరాళంగా ప్రకటించారు. న్యాయవాది చెరుకూరి మురళి పెనుమదం గ్రామంలో ఎకరం భూమి విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సేవ చేయడానికి భక్తులు పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమాలకు సంబంధించి ఉచిత టోకెన్లు టోకెన్లు కొరకు 9 9 8 9 2 8 8 1 8 6, 7 7 2 9 8 1 5 8 9 9 , 9 1 7 7 0 9 6 6 4 1 నంబర్లకు ఫోన్ చేసి పొందవచ్చు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనురుల శాఖామాత్యులు, ధర్మారావు ఫౌండేషన్ చైర్మన్, నిర్మల నిమ్మల రామానాయుడు, తిరుమల తిరుపతి పాలకమండలి సభ్యులు అక్కిన ముని కోటేశ్వరరావులకు ఉత్సవ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.