Skip to main content

Telugu News Power

జాతీయ పెన్షనర్స్ డే

సన్మానం అందుకున్న సీనియర్ పెన్షనర్లు

పాలకొల్లు:డిసెంబర్,17(తెలుగు న్యూస్ పవర్జాతీయ పింఛనుదారుల దినోత్సవం స్థానిక పింఛన్దారుల భవనంలో బుధవారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ నాయకులు వంగా నరసింహారావు అధ్యక్షత వహించారు. డి ఆర్ కె రాజు స్వాగతం పలికారు. ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి ఎస్ ప్రతాప్ రాజు నేషనల్ పెన్షన్ డే విశిష్టతను, డి ఎస్ నకారా, జస్టిస్ వై.వి.చంద్ర చూడ్ పెన్షనర్లకు చేసిన ఉపకారం మర్చిపోలేనిదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ విజయ సారథి, సబ్ ట్రెజరీ అధికారి వి ఎస్ ఎస్ శ్రీనివాస్ ను సీనియర్ పెన్షనర్లు సత్కరించి, దీవెనలందించారు. ఈ సందర్భంగా సీనియర్ పెన్షనర్లను వారు చేసిన ప్రస్తుతం చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలు గురించి వివరించారు. కేశిరాజు నరసింహారావు, మండెల శ్రీరామ చంద్ర మూర్తి, గుణ్ణం వీరస్వామి, ఇళ్ల విష్ణుమూర్తి, కంభంపాటి కామేశ్వరరావు, ప
కొట్టి భాస్కరరావు, కె.వి రమణి, ఎస్ దుర్గా పాలేశ్వరి సన్మానాలు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో చేగొండి సత్యనారాయణ మూర్తి, డి ఆర్ కె రాజు, అజయ్ కుమార్, వి రామకృష్ణంరాజు, కేవీ సత్యనారాయణ, అడబాల ప్రభాకర్, కలిదిండి వెంకటపతి వర్మ, చేగొండి శివప్రసాద్ పాల్గొన్నారు. కోశాధికారి కంతేటి వెంకట కృష్ణయ్య వందన సమర్పన చేశారు.