పాలకొల్లు:నవంబర్,29(తెలుగు న్యూస్ పవర్) స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం శనివారం జరిగింది. ఈ మొత్తం 32,64,772 రూపాయలు వచ్చినట్టు అధికారులు తెలిపారు. భీమవరం డివిజన్ దేవదాయ శాఖ అధికారి వి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ అధికారి ముచ్చర్ల శ్రీనివాస్ ట్రస్ట్ బోర్డ్ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర తదితర ధర్మకర్తలు, సూపరిండెంట్ వాసు, ఇండియన్ బ్యాంక్ సిబ్బంది, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగులు, సేవా సమితి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఉండి ఆదాయం లెక్కింపు.