Telugu News Power

క్షీరా రామంలో పంచాంగ శ్రవణం.

పాలకొల్లు: మార్చి, 19(తెలుగు న్యూస్ పవర్. కామ్) పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా, పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో వేద పండితులు మామిడిపాటి వెంకన్న పంచాంగ శ్రవణం చేశారు. ఈ ఏడాది ప్రజలకు అంతా మంచే జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రాము ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు పి వాసు ధర్మకర్తలు పలువురు భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగాది పంచాంగాలు, తీర్థప్రసాదాలు భక్తులకు అందజేశారు.

పంచాంగ శ్రవణం చేస్తున్న బండి పార్టీ వెంకన్న పండితులు