యలమంచిలి, నవంబర్ 21 (తెలుగు న్యూస్ పవర్) కూటమి ప్రభుత్వం పిపిపి విధానాన్ని వ్యతిరేకిస్తూ వైయస్సార్ సిపి పార్టీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం లో భాగంగా పలువురు వైఎస్ఆర్ సీపీ నాయకులు గురువారం రాత్రి పర్యటించారు. పి పిపి విధానం వల్ల పేద,మధ్యతరగతి వారి పిల్లలకు వైద్య విద్య చదవలేని పరిస్థితి కూటమి ప్రభుత్వం తెస్తుందని పాలకొల్లు నియోజకవర్గ ఇంచార్జ్ గుడాల గోపి రచ్చబండ కార్యక్రమంలో వివరించారు. ఈ సందర్భంగా రచ్చబండ కార్యక్రమంలో కోటి సంతకాల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఇందుకుగాను కమిటీలు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చించారు. రచ్చబండ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎడ్ల తాజాజి, యలమంచిలి మండల పార్టీ అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్ బాబు తదితరులు ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో, నియోజకవర్గ ఎంపీపీ ఇనుకొండ ధనలక్ష్మి రవి కుమార్, బోణం బులివెంకన్న , కడలి సునీత నరసింహారావు, మండల నాయకుడు, కొల్లు మాధవరావు , కొల్లాటి పెద్దిరాజు , కోరం చిట్టిబాబు, అధ్యక్షులు గా ఇల్లింకి శ్రీను ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు, కుంచె సుందర రావు , కట్టా వెంకటేశ్వర , రావి సుందర్ బాబు , చింతా దుర్గా శ్రీనివాస్ (వాసు ) , పొత్తూరి శ్రీనివాస్ రాజు , కోరం ప్రసన్న కుమార్, కుక్కల బాలచందర్ ,తదితరులు పాల్గొన్నారు.
