Telugu News Power

ఛాంబర్స్ కళాశాలలో ఈనెల 26న మెగా జాబ్ మేళా. -గోడ పత్రిక ఆవిష్కరించిన మంత్రి నిమ్మల.

పాలకొల్లు: మార్చి ,20 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఈ నెల 26న స్థానిక ఛాంబర్స్ కళాశాలలో జరగనున్న, మెగా ఉద్యోగమేళా గోడపత్రికను స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు శుక్రవారం ఆవిష్కరించారు. ఉద్యోగ కల్పనకు కృషి చేస్తున్న ఛాంబర్స్ కళాశాల యాజమాన్యాన్ని, ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు అభినందించారు. నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడంలో ఏ విధమైన సహాయం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నట్టు మంత్రి నిమ్మల ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, చాంబర్స్ కళాశాలలు సంయుక్తంగా చాంబర్స్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహింస్తున్నారరు. ఐటీ, ఫార్మా మరియు బ్యాంకింగ్ రంగానికి చెందిన 20 కంపెనీలతో 2000 పైగా ఉద్యోగాలతో నిర్వహించుచున్నారు. దీనిని పాలకొల్లు పరిసర ప్రాంతంలోని అభ్యర్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు కోరారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్య తో పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణను ఇస్తూ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందన్నారు. మెగా జాబ్ మేళాలో పాలకొల్లు మరియు పరిసర ప్రాంతాల్లోని అభ్యర్థులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు, కళాశాల కార్యదర్శి కె.వి సీతారామరాజు, కళాశాల కోశాధికారి ప్రవీణ్ భాను, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి వెంకటేశ్వరరావు, చాంబర్స్ సెక్రటరీ కటారి నాగేంద్ర కుమార్ , ప్లేస్మెంట్ ఆఫీసర్ యు. జానకి రామయ్య పాల్గొన్నారు.