
పాలకొల్లు: మార్చి,26(తెలుగు న్యూస్ పవర్. కామ్)
స్థానిక బి ఆర్ ఆర్ అండ్ జి కే ఆర్ చాంబర్స్ కళాశాల ప్రాంగణంలో ఏపీ ఎస్ ఎస్ డి సి మరియు నేషనల్ సర్వీస్ స్కీమ్ వారి సౌజన్యంతో జాబ్ మేళా గురువారం నిర్వహించారు. అత్యధిక సంఖ్యలో ఆశావహులు హాజరయ్యారు.
ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ శ్రీ కెవిఆర్ నరసింహారావు ఈకార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థి దశలోనే క్రమశిక్షణతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ప్రతి ఉద్యోగానికి సాంకేతిక నైపుణ్యం మరియు చురుకుదనం అవసరమన్నారు. ప్రతి విద్యార్థి చదువుతున్న కోర్సులతో పాటు అదనపు సర్టిఫికెట్ కోర్సులు, అర్థమెటిక్, లాజికల్ , క్రిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ పై పట్టు సాధించాలన్నారు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. వెంకటేశ్వరావు మాట్లాడుతూ, కళాశాల యాజమాన్యం విద్యార్థులకు విద్యతో పాటు, ఉద్యోగ అవకాశాలు కల్పన లక్ష్యంగా ప్రతి ఏట క్యాంపస్ ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నదన్నారు. విద్యార్థులు పోటీ ప్రపంచంలో సబ్జెక్టు పై పూర్తిస్థాయి పట్టు సాధించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్ ఎస్ డి సి మేనేజింగ్ డైరెక్టర్ లోకమాన్ మాట్లాడుతూ, కళాశాలలకే వచ్చి ఉద్యోగాలను కల్పించుటం ప్రత్యేక ప్రభుత్వ విధానం అన్నారు.
ఈ జాబ్ మేళాకు ఏకలవ్య సాఫ్ట్ స్కిల్స్, పానాసోనిక్, యాక్సిస్ బ్యాంక్, ఫాక్సికాన్, టాటా ఎలక్ట్రానిక్స్ మొత్తం 17 కంపెనీలు హెచ్ ఆర్ లు అభ్యర్థులకు రాత, మౌఖిక పరీక్షలు నిర్వహించి 138 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్, ప్రొఫెసర్ బి.విజయభాస్కర రావు అభ్యర్థులకు ఆఫర్ లెటర్స్ అందించారు.
ఈ కంపెనీలలో ఎంపికైన వారికి 15 – 30 వేల రూపాయల వరకు వేతనము ప్రకటించారు. ఎంపికైన అభ్యర్థులకు కళాశాల యాజమాన్యం అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సెక్రటరీ కేవీ సీతారామరాజు, ట్రెజరర్ ఆర్ ప్రవీణ్ భాను, అకాడమిక్ అడ్వైజర్స్ డాక్టర్ ఏబిఎస్ మూర్తి , నందుల సీతారామ రావు, ఎన్ ఎస్ ఎస్ కోఆర్డినేటర్ కిషోర్ రెడ్డి, గవర్నింగ్ బాడీ మెంబర్స్ మాటూరి నారాయణమూర్తి గహ, డాక్టర్ వర్మ , కంపెనీ హెచ్ఆర్లు, కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్స్ జానకిరామయ్య, మీనా, అధ్యాపకులు ఎన్ రవికుమార్, వర్మ, రాంబాబు, రాము, తదితరులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.