Skip to main content

Telugu News Power

జిల్లాలో పది పరీక్షలకు 24,127 మంది హాజరు.

పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ నాగరాణి

భీమవరం: మార్చి, 16(తెలుగు న్యూస్పవర్.కామ్).పశ్చిమగోదావరి జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంత ప్రారంభమయ్యాయి. మొదటిరోజు తెలుగు పేపర్, కొంతమేర కష్టంగా ఉన్నట్టు విద్యార్థులు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్య సహాయం అందించటానికి వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వేసవికాలం కావటంలో పరీక్ష కేంద్రాల వద్ద మంచినీటి సౌకర్యం కల్పించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విదధించారు. జిల్లాలో 132 కేంద్రాల్లో 24,127 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం పరీక్షా కేంద్రా న్ని జిల్లా విద్యాశాఖ అధికారితో కలిసి తనిఖీ చేశారు.