Telugu News Power

జక్కంపూడి కి మంత్రి నిమ్మల పరామర్శి.

నరసింహారావు నివాళులర్పిస్తున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు:జనవరి,22(తెలుగు న్యూస్ పవర్) స్థానిక బిజెపి నాయకులు,రైల్వే డి ఆర్ యు సి సి సభ్యులు, పోడూరు మండల బిజెపి ఇంచార్జ్ జక్కంపూడి కుమార్ ఇంటికి వెళ్లి,మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం పరామర్శించారు. కుమార్ తండ్రి జక్కంపూడి నరసింహారావు ఇటీవల మరణించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల వారికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు, ధైర్యం చెప్పి,సానుభూతి తెలియజేశారు. మంత్రివర్యులతో పాటు గుండేటి వెంకటేశ్వర్ల రావు, పెచ్చెట్టి బాబు, కడలి గోపాలరావు, కొల్లి పవన్, వాకాడ గణేష్, సత్యనారాయణ, వెంకట అప్పారావు, మల్లికార్జున రెడ్డి, పరామర్శించారు.