Skip to main content

Telugu News Power

గాయని ఎస్. జానకమ్మ కు పుత్రవియోగం.

తల్లిదండ్రులతో దివంగత మురళీకృష్ణ

హైదరాబాద్: జనవరి,22(తెలుగు న్యూస్ పవర్) ప్రముఖ, బహుభాషా, సీనియర్ గాయని ఎస్. జానకి కుమారుడు గురువారం, తెల్లవారుజామున, హైదరాబాదులో ఆకస్మిక గుండెపోటుతో మరణించారు. ఎస్ జానకి ఏకైక కుమారుడు మురళీకృష్ణ. వీరి వయస్సు 67 ఏళ్లు. ఇంతకుముందు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. భార్య నుంచి విడాకులు తీసుకుని, తల్లి దగ్గరే ఉంటున్నారు. విషాద వార్త సినీ జగత్తును దిగ్భ్రాంతికి గురిచేసింది. గాయని చిత్ర, తదితరులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.