మంగళగిరి: మార్చి,11(తెలుగు న్యూస్ పవర్. కామ్) జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నెల 17 వరకు పొడిగించింది. ఈ కార్యక్రమానికి విశేషంగా స్పందన రావడంతో ఈ నమోదు కార్యక్రమం పొడిగించాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ లోనే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సభ్యత్వ నమోదు ఉద్యమి ద్వారా జరుగుతున్నది. స్థానిక జనసేన నాయకులు కోరిన మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం పొడిగించినట్లు పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన లేఖలో పేర్కొన్నారు.
జనసేన సభ్యత్వ నమోదు 17 వరకు పొడిగింపు.