Telugu News Power

జల వనరులను కాపాడుకోవాలి.

పాలకొల్లు: మార్చి, 22(తెలుగు న్యూస్ పపర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల లో ఆదివారం ప్రపంచ నీటి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులలో నీటి సంరక్షణపై అవగాహన పెంపొందించేందుకు వ్యాసరచన మరియు పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలను నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, నీటి ప్రాముఖ్యత, సంరక్షణ,అవసరం, భవిష్యత్తు తరాలకు నీటి వనరులను కాపాడాల్సిన బాధ్యత వంటి అంశాలను తమ రచనలు మరియు పోస్టర్ల ద్వారా ప్రదర్శించారు.
ప్రిన్సిపల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి మాట్లాడుతూ, నీరు జీవనాధారం అని, ప్రతి ఒక్కరూ నీటి వృథాను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. జల సంరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. భవిష్యత్తులో నీటి కొరతను నివారించడానికి చిన్న,చిన్న చర్యలతో ప్రారంభించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జల శక్తి అభియాన్ కన్వీనర్ కే శివకృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పోటీలలో విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందించారు.

ప్రిన్సిపల్ నుండి ప్రశంసా పత్రాలు అందుకుంటున్న విజేతలు