Telugu News Power

జాతీయ రాజకీయాలకు దిక్సూచి తెలుగుదేశం పార్టీ -మంత్రి నిమ్మల

పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఎన్టీఆర్ నివాళులర్పిస్తున్న మంత్రి నిమ్మల
టిడిపి ఆవిర్భావ కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు: మార్చి, 29(తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం పెనుసంచలనమని, దేశ రాజకీయాలకు దిక్సూచని, పార్టీ కీలక నేత, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు, నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఆదివారం స్థానిక ఉగాది బొమ్మల్ సెంటర్ సమీపంలో ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి,పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ముందు, టిడిపి తర్వాత అనే స్పష్టమైన చరిత్ర సృష్టించింది అన్నారు. పేదవాడికి కూడు, గుడ్డ, నీడ కల్పనకు శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం అని వెల్లడించారు. వెనుకబడిన తరగతులకు 34 శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం అన్నారు. మహిళలకు సమాన ఆస్తి హక్కు కల్పించిన పార్టీ టిడిపి అన్నారు. నాటి నుంచి నేటి చంద్రబాబు నాయుడు వరకు ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దేశంలోనే తొలిసారి మహిళల సాధికారిక కోసం డ్వాక్రా సంఘాలను ప్రారంభించారన్నారు. అత్యంత క్రమశిక్షణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వల్ల పార్టీ నాలుగు దశాబ్దాల పాటు అప్రతిహతంగా రాజకీయ ఎవనికపై రెపరెపలాడుతుందన్నారు. వందేళ్ళ చరిత్ర కలిగిన పార్టీలు కూడా నేడు కొరుమురుగయ్యే పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో, తెలుగుదేశం నిలబడగలటం ఘణ చరిత్ర కలిగిన పార్టీ విశిష్టతని కొనియాడారు. ఈ కార్యక్రమంలో, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కోడి విజయభాస్కర్, రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు, కట్టిన అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షులు, పాములు రజని కుమార్, మామిడిశెట్టి పెద్దిరాజు, రమేష్ రాజు, రాష్ట్ర మహిళ,కర్నేని రోజా రమణి, పల్లపు శ్రీనివాసరావు, రాంబాబు, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆవిర్భావ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పేదలకు పళ్ళు, రొట్టెలు ఆసుపత్రిలో తెలుగుదేశం నాయకులు పంచిపెట్టారు.