భీమవరం: మార్చి,19(తెలుగు న్యూస్ పవర్.కాం) జిల్లా కలెక్టర్ వశిష్ట సమావేశ మందిరంలో ఉగాది వేడుకలు, కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది పచ్చడి షడ్రుచుల సందేశం, జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని చెబుతుందన్నారు. పరాభవ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం జరిగింది. ఈ సందర్భంగా సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. కూచిపూడి నృత్యాలు, శ్రీకృష్ణదేవ రాయల అష్ట అష్టదిగ్గజ కవుల భువన విజయం ఆహూతులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా, వివిధ రంగాలలో నిష్ణాతులైన వారికి కలెక్టర్ చేతుల మీదుగా సత్కారం జరిగింది.
ఉగాది పురస్కార గ్రహీతలతో కలెక్టర్ చదలవాడామ నాగరాణి