Telugu News Power

టెలికాం సంస్థల దోపిడీపై రాజ్యసభలో ప్రభుత్వాన్ని కడిగిపారేసిన రాఘవ్ చద్దా.

టెలికాం సంస్థల దోపిడీని రాజ్యసభలో ప్రశ్నిస్తున్న రాఘవ చద్ధా

న్యూఢిల్లీ: మార్చి,11(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ, అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు గురువారం రాజ్యసభలో టెలికాం సంస్థల దోపిడీపై భారత ప్రభుత్వాన్ని కడిగిపారేశారు.
ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జీల ఇన్‌కమింగ్ కాల్స్ ఆపడం, 28 రోజుల ‘మంత్లీ’ ప్లాన్ల మోసాల గురించి పార్లమెంట్‌లో,ప్రజల సమస్యలను ఎంపీ లేవనెత్తారు. భారతదేశంలో 125 కోట్ల మొబైల్ వాడకందార్లలో దాదాపు 90 శాతం మంది ప్రీపెయిడ్ ప్లాన్ కస్టమర్లు. రీచార్జీ ముగిస్తే అవుట్‌గోయింగ్ కాల్స్ ఆపడం అర్థంవుతుంది. కానీ ఇన్‌కమింగ్ కాల్స్ కూడా ఆపడం ఎందుకు? ఇలా చేస్తే వ్యక్తికి పూర్తిగా సంబంధాలు తెగిపోతాయి. బ్యాంక్ ఓటీపీ లు, అత్యవసర సందేశాలు వచ్చే అవకాశం ఉండదు. ఎమర్జెన్సీల్లో ఇది జీవన్మరణ సమస్య అవుతుందని పార్లమెంట్‌లో రాఘవ చద్ధా ఆందోళన వ్యక్తం చేశారు.
ఈరోజు పార్లమెంట్‌లో మాట్లాడుతూ ఎంపీ.”రీచార్జీ వాలిడిటీ ముగిస్తే అవుట్‌గోయింగ్ కాల్స్ ఆపడం సమంజసం. కానీ ఇన్‌కమింగ్ కాల్స్ ఆపడం అన్యాయం. వాడకం దారుల ఫోను, సిమ్ కార్డ్ లపై టెలికాం సంస్థల నిర్బంధాన్ని ఎంపీ గర్హించారు. దీనివల్ల ప్రజలు ఎవరితోనూ సంబంధం లేకుండమడాపోతారన్నారు. బ్యాంక్ ఓటీపీ లు, అత్యవసర సమాచారం చేరే అవకాశం లేకుండా పోతుంది. ఎమర్జెన్సీ సమయంలో ఇది ప్రాణాలకు ప్రతికూలంగా ఉంటుంది” అని హెచ్చరించారు. విజయవాడకు సంబంధించి సమాచారం లేక నిరుద్యోగులు నష్టపోతారన్నారు. మొబైల్ ఫోన్ ఇప్పుడు తప్పనిసరిగా ఉండవలసిన జీవనాధామని వాదించారు.28 రోజుల ‘మంత్లీ’ ప్లాన్ల మోసం, సంవత్సరానికి 13 రీచార్జీలు!
ఇంకో ముఖ్య సమస్య 28 రోజుల ‘మంత్లీ’ ప్లాన్లు. “మంత్లీ అంటే క్యాలెండర్ మంత్‌లా 30-31 రోజులు కావాలి. కానీ 28 రోజుల సైకిల్‌తో కస్టమర్లు సంవత్సరానికి 13 సార్లు రీచార్జ్ చేయాలి (28 రోజులు x 13 = 364 రోజులు). ఇది స్పష్టమైన మోసం. ప్రజలకు స్పష్టత, న్యాయం కావాలి, కుట్రపూరితమైన ప్రింట్ కాదు” అని ఎంపీ డిమాండ్ చేశారు.ప్రీపెయిడ్ కస్టమర్లకు న్యాయం కావాలి!
భారతదేశంలో ప్రీపెయిడ్ యూజర్లు ఎక్కువ. వీరికి సక్రమంగా, పారదర్శక విధానం కల్పించాలి. టెలికాం కంపెనీలు తమ తెలివితేటలతోప్రజలను మోసం చేయకూడదు. ప్రభుత్వం ఈ సమస్యలపై త్వరగా చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు.మొబైల్ ఫోన్ జీవనాధారమైన ఈ కాలంలో ప్రీపెయిడ్ కస్టమర్ల సమస్యలు పరిష్కరించడం తప్పనిసరి. ట్రాయ్ ఈ విషయంలో జోక్యం చేసుకోలవాలని డిమాండ్ చేశారు.