Telugu News Power

పాలకొల్లు పెనుమదం రోడ్డు పనులు ప్రారంభం వాహనాల దారి మళ్లింపు

పాలకొల్లు: నవంబర్, 17 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు నుండి ఆచంటపోవు ఆర్ అండ్ బి రోడ్డు అభివృద్ధి పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి.ఇందుకుగా ను కోటిన్నర రూపాయల ఎస్ హెచ్ ప్లాన్ నిధులు మంజూరయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేసిన నెల తిరగకుండానే పనులు ప్రారంభం అవడం చర్చనీయాంశం అయ్యింది.పాలకొల్లు ఎడ్ల బజార్ సెంటర్ నుంచి పెనుమదం రోడ్డు వైపు వెళ్లే వాహనాలకు మార్గం మూసివేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని ఆర్ అండ్ బి అధికారులు సూచించారు.