పాలకొల్లు: డిసెంబర్,17 (తెలుగు న్యూస్ పవర్). పాలకొల్లు మున్సిపాలిటీ ప్రత్యేక గ్రేడు మున్సిపాలిటీగా వర్గోన్నతి పొందటం, పాలకొల్లు పట్టణ ప్రజలందరికీ ఒక మంచి రోజుని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలు బలోపేతం చేయడానికి వాటిని ఈ విధంగా ప్రోత్సహిస్తున్నదని వెల్లడించారు. ఇందువల్ల మున్సిపాలిటీ లో అభివృద్ధి పనులు చేయటానికి అవకాశాలు ఎక్కువగా వస్తాయన్నారు. మంచినీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులు పెంచుకోవడానికి ఈ మార్పు ఉపయోగపడుతుందన్నారు. మున్సిపాలిటీ నూరేళ్ల తర్వాత ఇప్పుడు వర్గోన్నతి పొందడానికి స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు చేసిన కృషిని అంగర ప్రశంసించారు. నరసాపురం ఆర్డీవో, మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి దాసిరాజు మాట్లాడుతూ పాలకొల్లు మున్సిపాలిటీ వర్గోన్నతికి శ్రమించిన మంత్రి నిమ్మల రామానాయుడును పాలకొల్లు ప్రజలు అధికారులు తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ విజయసారథి,కూటమి నాయకులు గండేటి వెంకటేశ్వరరావు, వల్లభు శ్రీనివాస్, జనసేన నాయకులు చిన్న, తులా రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.