తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునే వరకు విశ్రాంతి లేకుండా పని చేస్తున్నానని మంత్రి రామానాయుడు పేర్కొన్నారు. టిడిపి అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా జరిగిన సభలో మంత్రి శుక్రవారం రాత్రి మాట్లాడారు. పాలకొల్లు లో భారీ బైక్ ర్యాలీ, మంత్రి స్వయంగా పాల్గొని,పురవీధుల్లో ఉత్సాహంగా పర్యటించారు. ఈ సందర్భంగా కిక్కిరిసిన పార్టీ అభిమానులు కార్యకర్తలునాయకులతో లయన్స్ కమ్యూనిటీ హాల్ జరిగింది సభలో మంత్రి ఉద్వేగంగా మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గం అభివృద్ధి పథంలో, సంక్షేమ దిశలో ముందు వరుసలో ఉంచడానికి నిరంతరం కృషి చేస్తానన్నారు.
ప్రమాణ స్వీకారోత్సవ సభలోనూతన కమిటీ కమిటీ సభ్యులతో మంత్రి రామానాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలనలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పార్టీ శ్రేణులంతా గడపగడపకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు ఏకపక్షంగా ఉండాలని నొక్కి చెప్పారు. పార్టీ శ్రేణులంతా క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేయాలని మంత్రి రామానాయుడు కోరారు. టిడిపి పాలకొల్లు పట్టణ అధ్యక్షునిగా గండేటి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా వల్లభు శ్రీనివాసరావు, తదితరులతో మంత్రి రామానాయుడు ప్రమాణస్వీకారం చేయించారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, కూటమి నాయకులు పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు , కర్నేన రోజారమణి గౌర్నాయుడు, మహమ్మద్ జానీ ,మండాది అవినాష్ ،ధనాని సూర్యప్రకాష్، పొట్నూరి శ్రీనివాస్، గాదే చిన్న వెంకన్న ،గాది సుబ్బారావు, అల్లం తాతాజీ ,మల్లుల వెంకట్ ،కొల్లు ఉదయ పవన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల రుణం తీర్చుకునె వరకు విశ్రాంతి లేదు – మంత్రి నిమ్మల