భీమవరం: మార్చి,16(తెలుగు న్యూస్ పవర్. కామ్) దాతలు ఇస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి విద్యార్థులు ఎదగాలని, స్థానిక ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, పులపర్తి రామాంజనేయులు పిలుపునిచ్చారు. దాతలు ఇచ్చిన ఉపకార వేతనాలను సోమవారం, అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం లోజరిగిన సమావేశంలో విద్యార్థులకు . సుమారు 10 లక్షల 98 వేల రూపాయలను,111 విద్యార్థులకు అందజేశారు. అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో 43 మంది దాతల సహకారంతో పట్టణంలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలను, వెదురునగరం స్కూల్ కు రూ 50 వేలు మొత్తం రూ 11 లక్షల 48 వేలు ఎమ్మెల్యే అంజిబాబు అందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ, తనకు చదవంటే ఎంతో ఇష్టమని, తను చదువుకోలేదని. తరువాత తరం ఖచ్చితంగా చదువుకోవాలనే తపన పడే వ్యక్తినని అన్నారు. ప్రతిభవంతులను ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లోనూ రాణిస్తారని, ప్రతిభకు పేదరికం అడ్డుకాదన్నారు. భీమవరం నియోజక వర్గంలో విద్యకు దూరంగా విద్యార్థులు ఉంటే తమ దృష్టికి వస్తే వారి ఉన్నత విద్యకు సహకారం అందిస్తామన్నారు. ఆర్డీవో ప్రవీణ్ కుమార్, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేశ్న కనకరాజు సూరి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు సేవా సమితి ప్రతి ఏడాది మెరిట్ స్కాలర్ షాప్ లు అందించడం అద్వితీయమన్నారు. ప్రతి విద్యార్థి చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. అనంతరం ఒక ఎంఎంబిఎస్, ఒక బిడిఎస్, ఒక సీఏ, ఒక ఎం టెక్, ఇద్దరు బి ఫార్మసి, ఇద్దరు ఎంసిఏ, ఒక ఏంబిఏ, 80 మంది బి టెక్, 4 గురు డిప్లొమా, 12 గురు డిగ్రీ, 6 గురు ఐటిఐ విద్యార్థులకు మొత్తం 111 మంది విద్యార్థులకు రూ 10 లక్షల 98 వేలు అందించారు. కార్యక్రమంలో శ్రీఅల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్ష, కార్యదర్శులు గాదిరాజు సుబ్బరాజు, సిహెచ్ సుబ్రహ్మణ్య రాజు, అల్లూరి సాయి దుర్గరాజు, చిలుకూరి నరసింహరాజు, కనుమూరి సత్యనారాయణ రాజు, ముదునూరి సూర్యనారాయణ రాజు, వేగేశ్న రమణరాజు, వేగేశ్న రామకృష్ణంరాజు, కూసనంపూడి వెంకట సత్యనారాయణ రాజు, సిహెచ్ ఝాన్సీ లక్ష్మి, పొత్తూరి బాపిరాజు, కంతేటి వెంకటరాజు, ఇందుకూరి రామలింగరాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రతిభావంతులను ప్రోత్సహించాలి -ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు.
విద్యార్థులకు అందజేస్తున్న ఎమ్మెల్యే పులపర్తి