Telugu News Power

భవిష్యత్తుపై వైసీపీలో అలజడి -మంత్రి నిమ్మల రామానాయుడు

మేడపాడు లో గజమాలతో మంత్రికి ఘనస్వాగతం
మేడపాడు శంకుస్థాపన సభలో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల

యలమంచిలి; ఏప్రిల్, 5(తెలుగు న్యూస్ పవర్. కామ్) భవిష్యత్తుపై వైసీపీ లో అలజడి మొదలైందని స్థానిక శాసనసభ్యులు,రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు వెల్లడించారు. స్థానిక మేడపాడు గ్రామాభివృద్ధికి సంబంధించి దాదాపు నాలుగు కోట్ల నిధులతో ప్రారంభం కాబోయే పనులకు ఆదివారం మంత్రి కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో మంత్రి మాట్లాడుతూ, జగన్ బయటకు వచ్చి సొంతంగా పత్రికా సమావేశాలు నిర్వహించకుండా నిరోధించాలని చూస్తున్నారన్నారు. జగన్ కు ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదివేలా చూడాలనుకుంటున్నారన్నారు. ప్రజల్ని గందరగోళానికి గురి చేసే విచిత్రమైన పదాల్ని జనంపై రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయన్నారు. మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్ ప్రతిపాదించిన మావిగన్, పేరు పక్కవారిని అడిగి, మంత్రి ఎద్దేవా చేశారు. స్థానిక శాసనసభ్యునిగా తన పదవీకాలం ఐదేళ్లలో ఐదు విద్యుత్ సబ్-స్టేషన్లు నిర్మించినట్టు మంత్రి నిమ్మల వెల్లడించారు. అదే జగన్ హయాంలో ఒక్క సబ్ స్టేషన్ కూడా నిర్మించలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల కాలంలోనే నియోజకవర్గంలో నాగరాజు పేటలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయి,
పని చేస్తుందన్నారు. మేడపాడు లో నిర్మించనున్న ఈ విద్యుత్ సబ్-స్టేషన్ కూడా మరో రెండు నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. లంకలకోడేరులో, ఎక్కడ లేని విధంగా 232కేవీ విద్యుత్ సబ్-స్టేషన్ నిర్మించనున్నట్టు తెలిపారు. బాధ్యతాయుతంగా పనిచేసే ప్రభుత్వాలకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. పాలకొల్లు నియోజకవర్గం ప్రజలు ఎక్కడకు వెళ్లినా సగవర్వంగా తలెత్తుకొని పాలకొల్లు పేరు చెప్పుకునేలా తాను కృషి చేస్తున్నానని మంత్రి పేర్కొన్నారు. త్వరలో రోడ్లు కూడా వేస్తామని, ముఖ్యంగా మేడపాడు నుంచి రాయపాడు వరకు రోడ్డు కు త్వరలో శంకుస్థాపన చేస్తామని మంత్రి వెల్లడించారు. మేడపాడు విద్యుత్ సబ్-స్టేషన్ కు రూ. 2.75 కోట్లు, స్మశాన వాటిక అభివృద్ధి కి, సిమెంట్ కూడా నిర్మాణానికి రూ.98.94 లక్షల రూపాయలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. 25 లక్షలు, వెరసి రూ. 3.99 ఓట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో, మండల పరిషత్ అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి రవి కుమార్ ఎంపీటీసీ డేగల సూర్యప్రభ, తెలుగుదేశం నాయకులు డేగల వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహనరావు, ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, చల్ల నరేంద్ర కుమార్, టిడిపి అధ్యక్షులు మామిడి శెట్టి పెద్దిరాజు, పాముల రజిని కుమార్, జనసేన అధ్యక్షులు కొడవటి వరబాబు, రుద్రరాజు సత్యనారాయణ రాజు, మాతా రత్నం రాజు, ఆరమిల్లి రామ్ శ్రీనివాస్, రాంభద్రరాజు, చిలుకూరు బాలాజీ, కడలి గోపి, వీరాజీ, స్థానిక ప్రజా ప్రతినిధులు కూటమి నాయకులు పాల్గొన్నారు.