పాలకొల్లు:డిసెంబర్,19 (తెలుగు న్యూస్ పవర్)స్థానిక అరట్లకట్ట గ్రామానికి చెందిన ముద్దాయి మామిడి శెట్టి రమేష్ బాబు (27) కు కోర్టు ఐ.పి.సి లోని వివిధ సెక్షన్ల కింద 13 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించినట్టు పాలకొల్లు గ్రామీణ పోలీసులు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ కేసు సంబంధించి పోలీసు వారు తెలిపిన వివరాల ప్రకారం 2022, జూన్ 16వ తేదీ రాత్రి నిందితుడు నేరం చేయాలనే ఉద్దేశంతో, నివాస గృహంలోకి చొరబడి, డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న యువతి(19) పై ఆమె సమ్మతి లేకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు అతనిపై కేసు నమోదయింది. పోలీసులు ఐపీసీ 376 (2)(f), ఐపీసీ 450 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రూరల్ ఎస్సై కే శ్రీనివాస్ కేసు నమోదు చేయగా, పాలకొల్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె శ్రీనివాస్ కుమార్ విచారణ జరిపారు. బాధితురాలు పదహారేళ్ల క్రితం 16 ఏళ్ళ క్రితం తల్లిని కోల్పోయింది. ఆమె అమ్మమ్మ జయతో కలిసి అరట్లకట్ట లో ఉంటున్నది. తండ్రి మామిడిశెట్టి విజయ రెండో వివాహం చేసుకొని లంకలకోడేరులో ఉంటున్నారు. ఈ కేసు పై విచారణ పూర్తి చేసి ఛార్జ్ షీట్ వేశారు. ఏలూరు 5వ అదనపు జిల్లా షెషన్స్ న్యాయమూర్తి ఎం వి వి ఎస్ మురళీకృష్ణ, సాక్ష్యాధారాలు పరిశీలించి,నిందుతుడిని ముద్దాయిగా నిర్ధారించి, శుక్రవారం తీర్పు వెలువరించారు. పై సెక్షన్ ల కింద, 10 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష, వెయ్యి రూపాయలు జరిమానా, రెండో సెక్షన్ కింద 3ఏళ్ళకఠిన కారాగార శిక్ష,500 రూపాయలు జరిమానా విధించారు. బాధితురాలు తరుపున పి పి చింతమనేని రమేష్ తన వాదనలు వినిపించారు. పశ్చిమగోదావరి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ వారు నరసాపురం డి.ఎస్.పి.జి శ్రీ వేద, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జీ శ్రీనివాస్, పాలకొల్లు గ్రామీణ ఎస్సై సురేంద్ర కుమార్, ఏ ఎస్ ఐ ప్రదీప్ కుమార్, కోర్ట్ పిసి ఆర్ ఏ వి రాజు లను ఈ కేసు విచారణ సమర్థవంతంగా నిర్వహించి, ముద్దాయికి శిక్షపడేలా చేసిన వారికి అభినందనలు తెలియజేశారు.
ముద్దాయికి 13 ఏళ్ల కఠిన కారాగార శిక్ష