
యలమంచిలి; ఫిబ్రవరి,8 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరులు శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు ఆదివారం యలమంచిలి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా బూరుగుపల్లిలో 3కోట్ల 55 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రక్షిత మంచినీటి పథకం పనులకు 66.40 లక్షల రూపాయలు, ఏటిగట్టు గ్రావెల్ రోడ్డు 2.52 లక్షలు, విలేజ్ హెల్త్ క్లినిక్ కు 36 లక్షల పనులకు శంకుస్థాపన చేసి శ్రీకారం చుట్టారు.
శిరగాలపల్లిలో రైతులకు నూతన క్యూ ఆర్ కోడ్ గల పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో దాసిరాజు, ఎమ్మార్వో గ్రంధిపవన్ కుమార్, ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి రవికుమార్, తెలుగుదేశం నాయకులు, మామిడి చెట్టు పెద్దిరాజు, బోనం నాని, ఆరమిల్లి రామ శ్రీనివాస్, చిట్టూరి ఆంజనేయులు, చిలుకూరు బాలాజీ, ఎంపీటీసీ డేగల సూర్య కుమారి,బిజెపి నాయకులు ఉన్నమట్ల కపర్తి,జనసేన నాయకులు కొడవటి దొరబాబు,