Skip to main content

Telugu News Power

తాళాబత్తులకు ఘనసత్కారం.

సత్కారం అందుకుంటున్న తలబత్తుల వెంకటేశ్వర్ల రావు.

పాలకొల్లు: ఫిబ్రవరి, 9(తెలుగు న్యూస్ పవర్) స్థానిక, నటినట సంక్షేమ సమాఖ్య, తాళబత్తుల వెంకటేశ్వరరావుకు జరిగిన సత్కారం గురించి సోమవారం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు,పాలకొల్లు ముద్దుబిడ్డ రచయిత,కళాభిమాని,కళాకారుడు, నాటక సంస్థ ప్రతినిధిగా ఎన్నో ఏళ్లుగా కళామతల్లి సేవలో తరిస్తున్న, తాళ బత్తుల వెంకటేశ్వరరావుకు, గుంటూరులో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన కళామందిరంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా మరియు వేదిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న భారతరంగ్ మహోత్సవ్ అంతర్జాతీయ నాటకోత్సవాల సందర్భంగా ప్రతిష్టాత్మకమైన, సత్కారం అందుకున్నారు. వీరికి పాలకొల్లు నటీనట వర్గం, ఉపాధ్యాయ మిత్రులు అభినందనలు తెలియజేసారు.