Telugu News Power

యలమంచిలి ముద్దుబిడ్డ చిలుకూరి నితిన్ 32 లక్షల ప్యాకేజ్.

యలమంచిలి:డిసెంబర్,8 (తెలుగు న్యూస్ పవర్) యలమంచిలి తెలుగుదేశం నాయకులు, చిలుకూరి వెంకట రాఘవేంద్ర కుమార్, వారి పెద్ద కుమారుడు నితిన్ భారీ ప్యాకేజీ అందుకున్నారు. నితిన్ ప్రస్తుతం ప్రతిష్టాత్మకమైన ముంబై ఐఐటీలో ఎంటెక్ చేస్తున్నారు. నేడు జరిగిన క్యాంపస్ సెలక్షన్లో బెంజ్ కంపెనీవారు ఈ భారీ ఆఫర్ ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు, మాంటిసోరి అధినేత కృష్ణ వర్మ, మాజీ జెడ్పిటిసి బోనం నాని, మండల టిడిపి ఉపాధ్యక్షులు తమ్మినీడి వెంకట సత్య శ్రీనివాస్, సొసైటీ అధ్యక్షులు బొప్పన హరి కిషోర్, చిలుకూరు బాలాజీ,నీటి సంఘం అధ్యక్షులు ఆరమిల్లి చిన్ని, యువత బొప్పన రాంబాబు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.